ఉత్తర కాశీకి ప్రత్యేక రైళ్లు
20/06/2013
కర్నూలు, జూన్ 19: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదల కారణంగా ఉత్తరకాశీలో ఇబ్బందులు పడుతున్న యాత్రికులను రాష్ట్రానికి రప్పించడానికి అవసరమైన రైళ్లను ప్రత్యేకంగా నడుపుతామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ ఉత్తరకాశీలో చిక్కుకుపోయిన తెలుగు ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందుతున్నాయన్నారు. వరదల కారణంగా తెలుగువారు ఆపదలో చిక్కుకున్నారన్న విషయం తెలిసిన వెంటనే తాను ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించానన్నారు. యాత్రికుల క్షేమ సమాచారం తెలుసుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగువారంతా పలు సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారన్నారు. వారందరినీ ఒక చోటకుచేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని ఆ తరువాత వారికి ఎన్ని రైళ్లు అవసరమైతే అన్ని రైళ్లను ప్రత్యేకంగా నడిపేందుకు...
more... చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.