Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark modesite support
 
Sat Sep 7 17:42:12 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz
Topics
Gallery
News
FAQ
Trips
Login
RailCal Android App
RailCal iPhone App
Advanced Search
<<prev entry    next entry>>
News Entry# 561986
Jul 25 (07:57) Indian Railways Allocates ₹9,151 Crore for Andhra Pradesh, Includes Amaravati Rail Line Project (www.eenadu.net)
36333 views
0

News Entry# 561986   
  Past Edits
Jul 25 2024 (07:57)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Jul 25 2024 (07:57)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158

Jul 25 2024 (07:57)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158

Jul 25 2024 (07:57)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
read full article... Amaravati railway line: రూ.2 వేల కోట్లతో అమరావతి రైల్వేలైన్‌ అభివృద్ధి

The Indian Railway Minister, Ashwini Vaishnaw, announced an allocation of ₹9,151 crore for Andhra Pradesh in the railway budget. This includes a ₹2,047 crore project to construct a 56 km railway line connecting Amaravati, the state capital, with a bridge over the Krishna River. The Minister also mentioned that the...
more...
Vijayawada railway station is being modernized to accommodate the needs of the next 50 years, considering the upcoming development of Amaravati. Vaishnaw stated that the government is working to expedite railway projects in the state, including the development of a new railway zone with headquarters in Visakhapatnam. The construction of the Visakhapatnam zone is pending due to a change in location requested by the state government, and the minister expects the new location to be finalized soon. In terms of new train services, the minister confirmed that a Vande Bharat Express between Bengaluru and Vijayawada is being considered.

Railway Minister Ashwini Vaishnaw ne Andhra Pradesh ke liye railway budget mein ₹9,151 crore allocate kiya hai. Ismein Amaravati, state capital, ko connect karne wala 56 km railway line ka ₹2,047 crore ka project bhi include hai, jisme Krishna River par ek bridge bhi banega. Minister ne yeh bhi bataya ki...
more...
Vijayawada railway station ko next 50 saal ke liye modernize kiya ja raha hai, Amaravati ke development ko dhyan mein rakhte hue. Vaishnaw ne yeh bhi kaha ki government state mein railway projects ko jaldi se jaldi complete karne ke liye kaam kar rahi hai, jisme Visakhapatnam mein headquarters ke saath ek new railway zone ka development bhi include hai. Visakhapatnam zone ka construction state government ki taraf se location change karne ki wajah se ruk gaya hai, aur minister ko umeed hai ki yeh location jaldi decide ho jaayega. New train services ke baare mein, minister ne confirm kiya ki Bengaluru aur Vijayawada ke beech ek Vande Bharat Express start karne ka plan banaya ja raha hai.

Rail News
37660 views
0

Jul 25 (07:59)
NaagendraV
NaagendraV   386 blog posts
Re# 6135587-1              
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రూ.9,151 కోట్లుకృష్ణా నదిపై భారీ వంతెన డీపీఆర్‌కు రైల్వే బోర్డు, నీతిఆయోగ్‌ ఆమోదముద్ర 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని విజయవాడ స్టేషన్‌ ఆధునికీకరణ లోక్‌సభలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి 

...
more...


లోక్‌సభలో మాట్లాడుతున్న అశ్వినీవైష్ణవ్‌

ఈనాడు, దిల్లీ: రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను అభివృద్ధి చేయబోతోందని చెప్పారు. ఈ మార్గంలో కృష్ణా నదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నందున ప్రాజెక్టు వ్యయం ఇంత పెద్ద స్థాయిలో ఉందని చెప్పారు.  

బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల పూర్తి, విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ గురించి తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్‌ అడిగిన ప్రశ్నలకు, ఆ తర్వాత రైల్‌భవన్‌లో జరిగిన సమావేశంలో విలేకర్ల ప్రశ్నలకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. 



‘ఆంధ్రప్రదేశ్‌ చాలా ముఖ్యమైన రాష్ట్రం. గత పదేళ్లలో రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు కేటాయించాం. 2009-14 మధ్య ఉమ్మడి రాష్ట్రానికి ఏటా సగటున రూ.886 కోట్లు కేటాయిస్తే, మోదీ ప్రభుత్వంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది ఒక్కటే రూ.9,151 కోట్లు కేటాయించాం. యూపీఏ హయాంలో ఏటా సగటున 72 కి.మీ. రైల్లే లైన్ల నిర్మాణం జరిగితే, మోదీ ప్రభుత్వం వచ్చాక అది 150 కి.మీ.కి పెరిగింది. రాష్ట్రంలో రైల్వేలైన్ల విద్యుదీకరణ 100% పూర్తయింది. ప్రస్తుతం ఏపీలో రూ.73,743 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అమృత్‌ పథకం కింద 73 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. గత పదేళ్లలో 743 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాం. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రూ.26,292 కోట్ల విలువైన 1,935 కి.మీ. 17 కొత్తలైన్ల నిర్మాణం కొనసాగుతోంది’ అని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. అమరావతి రైల్వే లైనుకు సంబంధించిన డీపీఆర్‌కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఇటీవల నీతిఆయోగ్‌ ఆమోదముద్ర వేసిందన్నారు. తదుపరి దశ అనుమతులకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పురోగతి బాగుందన్నారు. ఈ లైన్‌ ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై కృష్ణా నది మీదుగా అమరావతి స్టేషన్‌ నుంచి నంబూరు వరకు వెళ్తుందని మంత్రి వివరించారు. 

రైల్వేజోన్‌కు స్థలం ఇచ్చిన వెంటనే నిర్మాణం  

విశాఖపట్నం కేంద్రంగా తలపెట్టిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కొత్తగా వేరేచోట స్థలం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ‘ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన భూమి చెరువు ముంపు నీటిలో ఉండటంతో ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం కేటాయించాలని పాత ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతూ వచ్చాం. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు విశాఖలోని డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లి ఎలాంటి స్థలం అనువుగా ఉంటుందన్నదానిపై చర్చించారు. దీనిపై రామ్మోహన్‌నాయుడితో నేను కూడా మాట్లాడాను. త్వరగా కొత్త స్థలం గుర్తించి, స్వాధీనం చేస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి కూడా చెప్పాం. త్వరలో అడుగులు పడతాయని ఆశిస్తున్నాం’ అని ఆయన వివరించారు. 

ప్రాజెక్టుల వేగం పెంచుతున్నాం

రైల్వే ప్రాజెక్టుల వ్యయాన్ని పంచుకొనే అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉందని.. దీంతోపాటు భూసేకరణ సమస్య గురించీ తాను ముఖ్యమంత్రితో మాట్లాడానని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేపరంగా చాలా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ విస్తరణ గురించి ఎంపీ కేశినేని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఆ ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌లో చేర్చిన దీని ఆధునికీకరణకు మాస్టర్‌ ప్లానింగ్‌ పూర్తయింది. దేశంలో అత్యధిక రద్దీ ఉండే స్టేషన్లలో ఒకటైన విజయవాడను వచ్చే 50 ఏళ్ల కాలాన్ని, సమీపంలో ఉన్న అమరావతిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్, ఇతర ప్రాజెక్టు వివరాలను ఎంపీకి అందజేస్తాం’ అని చెప్పారు.

బెంగళూరు- విజయవాడ వందేభారత్‌!

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల జాప్యానికి కారణమేంటి? అనకాపల్లి స్టేషన్‌ను ఎప్పుడు అభివృద్ధి చేస్తారని ఎంపీ సీఎం రమేష్‌ ప్రశ్నించారు. అనకాపల్లి స్టేషన్‌ను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో చేర్చి, దాని అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు మంత్రి జవాబిచ్చారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల ఆలస్యానికి చాలా కారణాలున్నాయని, అందులో భూసేకరణలో జాప్యం అత్యంత ప్రధానమైందని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సుహృద్భావ వాతావరణంలో పనిచేసి భూసేకరణ వేగవంతంగా జరిగేలా చూస్తామని వివరించారు. విజయవాడ, ముంబయి మధ్య దూరం ఎక్కువ కావడంతో ఆ రెండు స్టేషన్ల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బెంగళూరు - విజయవాడ మధ్య ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy